Gudur: ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాక్ ప్రీ-అవేర్నెస్ శిక్షణ

Gudur: గూడూరు ఎస్.కె.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ గ్రేడింగ్ మెరుగుపరుచుకునే దిశగా అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Oct 2026 7:40 PM IST
Gudur
X

Gudur: ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాక్ ప్రీ-అవేర్నెస్ శిక్షణ

గూడూరు: గూడూరులోని ఎస్.కె. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ గ్రేడింగ్లో ఉత్తమ ప్రమాణాలను సాధించే లక్ష్యంతో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాక్ ప్రీ-అవేర్నెస్ ప్రోగ్రామ్-2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. మస్తానయ్య ముఖ్య వక్తగా హాజరై విలువైన సూచనలు అందించారు.

కళాశాలలో సరస్వతీ పూజ అనంతరం ఎంపిక చేసిన అధ్యాపకులకు నిర్వహించిన ఈ శిక్షణలో న్యాక్ మూల్యాంకనానికి అవసరమైన కళాశాల రికార్డుల నిర్వహణ, విద్యార్ధుల భాగస్వామ్యంతో సామాజిక కార్యక్రమాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, సెమినార్లు, చర్చాగోష్ఠులు తదితర అంశాలపై డాక్టర్ మస్తానయ్య సమగ్రంగా వివరించారు. న్యాక్ మూల్యాంకన బృందాలతో కళాశాలలను సందర్శించిన తన అనుభవాలను పంచుకుంటూ, అధ్యాపకులు నాణ్యమైన విద్యతో పాటు నిరంతర విద్యా, విస్తరణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్ మాట్లాడుతూ, ఈసారి న్యాక్ మూల్యాంకనంలో కళాశాల మెరుగైన గ్రేడ్ సాధించేందుకు ప్రతి అధ్యాపకుడు సమన్వయంతో, నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రికార్డుల నిర్వహణ నుంచి విద్యార్ధుల నైపుణ్యాభివృద్ధి వరకు ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు.

అనంతరం ముఖ్య వక్త డాక్టర్ సి.హెచ్. మస్తానయ్యను కళాశాల తరపున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కిరణ్మయి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ యశోద, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ కె. లావణ్య, డాక్టర్ ఏ.వి. ప్రసాద్, వి.వి. రమణా రెడ్డి, వాసంతి, డాక్టర్ మహేష్, తదితర అధ్యాపకులు , పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్