Gudur: గూడూరులో ఎన్నికల సన్నద్ధతపై పోలీసుల సమీక్షా సమావేశం

Gudur: గూడూరు సబ్ డివిజన్‌లో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు SDPO అజిత్ వేజెండ్ల ఆధ్వర్యంలో సమీక్ష. 180 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2026 6:23 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ఎన్నికల సన్నద్ధతపై పోలీసుల సమీక్షా సమావేశం

గూడూరు: గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఈ రోజు ఎలక్షన్ ప్రిపేర్డ్ నెస్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సీఐలు, ఎస్ఐలు అందరూ హాజరయ్యారు.డివిజనల్ పోలీస్ అధికారి అజిత్ వేజెండ్ల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ గా, ఇన్సిడెంట్ ఫ్రీ గానిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యమని స్పష్టం చేశారు.

అందులో భాగంగా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అందులో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, ట్రబుల్ సమ్ ఏరియాలను లిస్ట్ అవుట్ చేశారు.మొత్తం 180 వరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తామని, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ పై నిఘా పెట్టామని హెచ్చరించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలందరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో గూడూరు వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్