Gudur: హెచ్‌ఏఎం ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
Gudur: గూడూరులో హెచ్‌ఏఎం పథకం ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. గత పాలనపై విమర్శలు.
Gudur: హెచ్‌ఏఎం ద్వారా రూ.30 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
గూడూరు: గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైబ్రిడ్ యూనిటీ మోడల్ HAM ద్వారా వర్చువల్ గా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని నాయకులు కార్యకర్తలు వీక్షించారు.
అభివృద్ధి పనుల శిలాఫలక బోర్డును ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక వార్డుల్లో సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించడం జరిగిందని టిడిపి ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు గతంలో నన్ను ఓడించి వైసిపి పార్టీని ప్రజలు గెలిపించారని అయితే ఐదు సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు HAM ద్వారా మున్సిపాలిటీకి 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని పట్టణంలోని పార్కులు సిసి రోడ్లు కాలువలు నిర్మాణం చేపడతామని అన్నారు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు తెలుసుకోవాలని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో పార్కులు పలు వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ఈసమావేశంలో కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి ,రహీం,పులిమి శ్రీనివాసులు, శివకుమార్ ,చంద్రమౌళి , శ్రీనివాసులు మునిగిరీష్, దయాకర్, ప్రణీత్ యాదవ్, బాలకృష్ణ నాయుడు,వెంకటేశ్వరరాజు,ఇజ్రాయిల్ ,పెంచలయ్య,తదితరులు పాల్గొన్నారు.




