Gudur: ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు, మైక్ విరాళం!

Gudur: గూడూరు ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థిని డాక్టర్ డి.మాధవి రూ.1.10 లక్షల విరాళం అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2026 4:50 PM IST
Gudur
X

Gudur: ఎస్.కే.ఆర్ డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు, మైక్ విరాళం!

గూడూరు: గూడూరు రెండవ పట్టణంలో ఏర్పాటై ఉన్న ఎస్.కే.ఆర్ ప్రభుత్వ డిగ్రీ , జూనియర్ కళాశాలలో బుధవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్. డి.మాధవి దాతృత్వంతో విద్యార్థులకు 1లక్షా,10వేల రూపాయలు విలువచేసే డెస్క్ టాప్, కంప్యూటర్స్ మైక్ సిస్టంను కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ రెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు తిరుమూరు సురేష్ రెడ్డి మాట్లాడుతూ... అప్పట్లో రోటరీ క్లబ్ ప్రతినిధుల ద్వారానే ఎస్.కే.ఆర్ కళాశాల ఏర్పాటు, నిర్వహణ జరిగాయని,రోటరీ క్లబ్ ద్వారా నిరంతరం గూడూరు పట్టణం , పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కళాశాలలో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు దాతృత్వాన్ని అందించిన పూర్వ విద్యార్థి డాక్టర్.మాధవి నీ క్లబ్ ద్వారా అభినందిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.వి నాగేంద్రప్రసాద్, కార్యదర్శి కె.నాగ సునీల్ కుమార్, ఎన్.బాలకృష్ణం రాజు, బి.రాంప్రసాద్, తాళంకి . సురేష్, ఎన్వి రత్నం, పి. హరిప్రసాద్,కిరణ్ చక్రవర్తి,బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్