Gudur: గూడూరులో 'ఆపరేషన్ త్రిశూల్': మూడు సవాళ్లకు చెక్
Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో డ్రగ్స్ కట్టడి, మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ 'ఆపరేషన్ త్రిశూల్' అవగాహన సదస్సు నిర్వహించింది.
Gudur: గూడూరులో 'ఆపరేషన్ త్రిశూల్': మూడు సవాళ్లకు చెక్
నెల్లూరు జిల్లా, గూడూరు: సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మూడు ప్రధాన సవాళ్లు... డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాలు. ఈ మూడింటికీ ఒకేసారి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ త్రిశూల్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పొట్టి శ్రీరాములు పార్క్ వీధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రత్యేక డ్రైవ్ DSP గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, స్థానిక ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడం. నెల్లూరు జిల్లా గూడూరులో యువత డ్రగ్స్ బారిన పడకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి సరఫరా చేసే వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మహిళల భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య ఉంటే 100, 112, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని అవగాహన కల్పించారు.
రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడం. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ ప్రమాదకరమని పోలీసులు అవగాహన కల్పించారు.
ఒకవైపు యువత భవిష్యత్తు, మరోవైపు మహిళల భద్రత, ఇంకోవైపు ప్రజల ప్రాణాలు... ఈ మూడింటి రక్షణే ఆపరేషన్ త్రిశూల్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని DSP గారు తెలిపారు. నెల్లూరు జిల్లా గూడూరును డ్రగ్స్ రహిత, సురక్షిత, ప్రమాద రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.




