Gudur: అభివృద్ధి పనులకు రూ. 10 కోట్లు మంజూరు

Gudur: గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరయ్యాయి. పోటుపాలెంలో రూ. 2 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 6:28 PM IST
Gudur
X

Gudur: అభివృద్ధి పనులకు రూ. 10 కోట్లు మంజూరు

గూడూరు: గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రకటించారు. గూడూరు మండలం పోటు పాలెం గ్రామంలో 2 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గూడూరు నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.ఈ నిధులతో మొదటి విడతగా గూడూరు మండలం పోటు పాలెం కూడలి వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో పోటు పాలెం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ... గూడూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు నిధులు తీసుకువస్తున్నామని అన్నారు. మంజూరైన 10 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పోటు పాలెం రోడ్డును నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచు రామయ్య, వాటంబేడు హరికుమార్, మట్టం శ్రావణి, రహీం, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్