Gudur: గూడూరులో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవ వేడుకలు!

Gudur: గూడూరు ఎంపీడీవో కార్యాలయంలో అంగన్‌వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వంలోనే అంగన్‌వాడీల వేతనాలు పెంచామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Sept 2026 5:34 PM IST
Gudur
X

Gudur: గూడూరులో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవ వేడుకలు!

Gudur: గూడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడి ఉత్సవం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు గర్భిణీలకు సామూహిక సీమంతాలు అంగన్వాడీ టీచర్లను సన్మానించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏదైనా మేలు జరిగిందంటే అది టిడిపి ప్రభుత్వం లోనే అని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు ఏమి చేయలేదని చిన్నపిల్లలను తల్లిదండ్రుల తర్వాత అంత ప్రేమగా అంగన్వాడీ వర్కర్లు చూసుకుంటారని మీ సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయని ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుందని వెల్లడించారు ఎక్కడైనా అధ్వానంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల వివరాలను తెలియజేస్తే త్వరలో నూతన బిల్డింగ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఐసిడిఎస్ సిడిపిఓ రెహనా బేగం ,నాయకులు బిల్లు చెంచురామయ్య, మట్టం శ్రావణి, లీలావతి,అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్