Gudur: జనసేన నాయకుడు కొణిదల మునిగిరీష్ జన్మదిన వేడుకలు
Gudur: గూడూరులో జనసేన యువ నాయకుడు కొణిదల మునిగిరీష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.
Gudur: జనసేన నాయకుడు కొణిదల మునిగిరీష్ జన్మదిన వేడుకలు
గూడూరు: గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ సెంటర్ వద్ద జనసేన నాయకులు కొణిదల మునిగిరీష్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అభిమానుల కేరింతల మధ్య కేక్ కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న యువ నాయకులు కొణిదల మునిగిరేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని సంగం థియేటర్ సెంటర్ వద్ద ఈ వేడుకలను ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు.
ముందుగా కొణిదల మునిగిరేష్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం తన పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం వేదికపై నాయకులు మాట్లాడుతూ... కొణిదల మునిగిరేష్ నిత్యం ప్రజా సేవలో ఉంటారని, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నయూమ్, చంద్ర, నీల్ తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.




