Gudur: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి: రఘురాం గౌడ్
Gudur: గూడూరు డివిజన్‌లో గీత కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రభుత్వ రాయితీలు అందించాలని, లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గౌడ సంఘం తీర్మానించింది.
Gudur: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి: రఘురాం గౌడ్
గూడూరు: గూడూరు డివిజన్‌లో గౌడ, గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గౌడ సంగీయులు సమిష్టిగా కృషి చేయాలని గూడూరు డివిజన్ గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కమ్మటి రఘురాం గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గూడూరు పట్టణ శివారులోని శ్రీ శ్రీ తాళ్లమ్మ ఆలయంలో గౌడ గీత కార్మికుల సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యుల తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు అన్నం రఘురామయ్య గౌడ్ , తిరకాల నాగేశ్వరరావు గౌడ్, సలహాదారులు కుడుముల నారాయణ గౌడ్ యాలపల్లి గోవర్ధన్ గౌడ్ లు మాట్లాడుతూ గౌడ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క గౌడ సంఘీయుడు తనవంతు కృషి చేయాలని కోరారు. గూడూరు డివిజన్ లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకతీతంగా గౌడ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు గౌడ సంఘీయులందరూ కృషి చేయాలన్నారు.. రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు కూడా మన వంతు కృషి చేయాలని సూచించారు..అధ్యక్షులు కమ్మటి రఘురాం గౌడ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని గౌడ సంఘీయుల సమస్యలను ఎప్పటికప్పుడు కమిటీ దృష్టికి తీసుకువచ్చి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గౌడ సంఘ పితామహుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని గూడూరులో ఏర్పాటు చేసేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలని, ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌తో చర్చించి విగ్రహ ఏర్పాటుకు కృషి చేద్దామని అన్నారు.
కల్లుగీత సంఘం అధ్యక్షులు రావుల యాగాంజనేయులు గౌడ్, ఉప్పల దయాకర్ గౌడ్ లు మాట్లాడుతూ తాటి చెట్లు ఎక్కే ప్రతి కల్లు గీత కార్మికుడికి గుర్తింపు కార్డులు అందడంతో పాటు ప్రభుత్వం నుంచి లభించే రాయితీలు, సంక్షేమ పథకాలు అందేలా సంఘం కృషి చేయాలని కోరారు.
గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పర్చూరు బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గూడూరు డివిజన్‌లోని అన్ని మండలాల్లో గౌడ సంఘాన్ని బలోపేతం చేయాలని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను మండల నాయకులు డివిజన్ నాయకుల దృష్టికి తీసుకువచ్చి సమన్వయంతో పరిష్కరించేందుకు ముందుకు సాగాలని సూచించారు. గీత కార్మికులకు అవసరమైన లైసెన్స్ కార్డులు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో చర్చించి సాధించుకునేందుకు ప్రయత్నం చేద్దామని తెలిపారు.ఇంకా
ఈ కార్యక్రమంలో కోశాధికారి తాతా సునీల్ కుమార్, కార్యదర్శి అన్నం మురళి గౌడ్, కోట మండల అధ్యక్షులు చల్లా సురేష్, చిల్లకూరు మండల నాయకులు వెంపులూరు శ్రీనివాసులు, ఉప్పల చందు,కార్యవర్గ సభ్యులు పర్చూరు కుమార్ గౌడ్, రావుల కోటేశ్వరరావు గౌడ్, ఆరు మూల రాఘవ గౌడ్ దాసరి కోటేశ్వరరావు గౌడ్, మల్లిపెద్ది చంద్రశేఖర్ గౌడ్, పర్చూరు వెంకటేశ్వర్లు గౌడ్, ఉప్పల సుబ్రహ్మణ్యం గౌడ్, కాల్తిరెడ్డి అశోక్ గౌడ్, వేంపులూరు అంకయ్య గౌడ్ , కమ్మటి రమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




