Gudur: ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఆహార పదార్థాల పంపిణీ

Gudur: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలింతలు, డయాలసిస్ రోగులకు పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 6:18 PM IST
Gudur
X

Gudur: ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఆహార పదార్థాల పంపిణీ

గూడూరు: గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలింతలు, డయాలసిస్ రోగులకు ఇన్నర్ వీల్ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో పండ్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు.

గాంధీజీ, జయంతి సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలకు, డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు రొట్టెలు, రస్కులు, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు.

ఈ సేవా కార్యక్రమాన్ని ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సంయుక్తంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి సుప్రియ, సభ్యులు జీవని రెడ్డి, సుప్రజ, సాయి సుమతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్