Gudur: గూడూరు జెండా పండుగకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరు జెండా పండుగ సందర్భంగా డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Gudur: గూడూరు జెండా పండుగకు పకడ్బందీ పోలీస్ బందోబస్తు!
Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో అత్యంత వైభవంగా ప్రారంభమైన జెండా పండుగకు పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు DSP నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ భక్తులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరులో అత్యంత వైభవంగా ప్రారంభమైన జెండా పండుగ.భారీ సెట్టింగులు, విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న వీధులు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చిన భక్తులతో గూడూరు పట్టణం జనసంద్రంగా మారింది. యువత ఈలలు, అరుపులతో పట్టణం సందడిగా మారింది.
అయితే ఈ భారీ జనసందోహాన్ని కంట్రోల్ చేయడంలో గూడూరు DSP నరసింహమూర్తి చూపిన చొరవ అభినందనీయం.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయ పరిసరాల్లో, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు.ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేశారు.భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు.
మహిళలు, చిన్న పిల్లల భద్రతకు ప్రత్యేక మహిళా పోలీస్ సిబ్బందిని మోహరించారు.DSP నరసింహమూర్తి స్వయంగా రంగంలోకి దిగి, బందోబస్తును పర్యవేక్షిస్తూ, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంలో పోలీస్ శాఖ చేసిన ఏర్పాట్లు భక్తులకు ఎంతో భరోసానిచ్చాయి.పోలీసుల ఈ పకడ్బందీ ఏర్పాట్ల వల్లనే జెండా పండుగ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సందడిగా సాగుతోందని భక్తులు, స్థానిక ప్రజలు DSP నరసింహమూర్తి , పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.




