Gudur: మిగిలిపోయిన 9 A4 మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు
Gudur: గూడూరు పరిధిలో 2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి మిగిలిన 9 A4 మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు.
Gudur: మిగిలిపోయిన 9 A4 మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగింపు
గూడూరు: గూడూరు నియోజకవర్గంలో మద్యం వ్యాపారులకు .2026-27 ఎక్సైజ్ సంవత్సరానికి గూడూరు పరిధిలో మిగిలిపోయిన 9 A4 మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.
2026-27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే గూడూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కొన్ని దుకాణాలకు సరైన స్పందన రాకపోవడంతో అధికారులు గడువు పొడిగించారు.
- గూడూరు మున్సిపాలిటీ పరిధిలో మిగిలినవి - 07 దుకాణాలు
- చిల్లకూరు మండలంలో మిగిలినవి - 02 దుకాణాలు
- మొత్తం - 09 A4 మద్యం దుకాణాలు
గూడూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ SK. కరీమా బేగం గారు, సబ్-ఇన్స్పెక్టర్లు A. శేషయ్య, S. ప్రేమ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు
ప్రారంభం: 24-09-2026*
2. దరఖాస్తులకు చివరి తేదీ: 06-10-2026 రాత్రి 12 గంటల వరకు
3. దరఖాస్తుల పరిశీలన: 07-10-2026
4. లాటరీ తీయు తేదీ: 08-10-2026 ఉదయం 08.00 గంటలకు
లైసెన్సు కాలం 01-10-2026 నుండి 30-09-2027 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
ప్రతి దుకాణానికి అప్లికేషన్ ఫీజు రూ. 3,00,000/- + ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,000/- మొత్తం రూ. 3,01,000/-* చెల్లించాలి.
ఒక్కో దుకాణానికి కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తారు. 4 కంటే తక్కువ వస్తే మళ్లీ గడువు పొడిగిస్తారు కానీ కట్టిన ఫీజు వెనక్కి ఇవ్వరు.
https://oc.hpfspproject.com/ వెబ్సైట్ లో Form-A3(A) ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా అప్లై చేసుకోవచ్చు.
లాటరీ కార్యక్రమం అక్టోబర్ 8న ఉదయం 8 గంటలకు నెల్లూరులోని జిల్లా పరిషత్ మీటింగ్ హాలు, సూరజ్ ZP ప్రాంగణం, పొదలకూరు రోడ్డు లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది అని తెలియజేశారు.




