Gudur: గూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన!

Gudur: గూడూరు టవర్ క్లాక్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టి, ఈసీఐపై విశ్వాసం కల్పించాలని మరియు సీఈఐ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2026 3:43 PM IST
Gudur
X

Gudur: గూడూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన!

Gudur: ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల జాబితాలకు సంబంధించిన సమాచారాన్ని డిమాండ్ చేస్తూ గౌరవనీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి నాయకులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఇండియా కూటమికి చెందిన ఎంపీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించి, లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ప్రతిపక్ష నాయకుడిపై, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాడి ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఈ రోజును భారత ప్రజాస్వామ్యానికి “బ్లాక్ డే”గా ప్రకటించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, గూడూరు టవర్ క్లాక్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియపై మరియు ఎన్నికల సంఘంపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ రామకృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వేమయ్య, రాష్ట్ర INTUC అధ్యక్షుడు పూల చంద్రశేఖర్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ నాయుకల ఫయాజ్,రాష్ట్ర కాంగ్రెస్ బిసి విభాగం కార్యదర్శి రావూరి బ్రహ్మయ్య, జిల్లా కాంగ్రెస్ బిసి విభాగం కార్యదర్శి గుంటమడుగు సుబరామరాజు

,గూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారావు, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, ముత్తుకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంకయ్య, ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి ,మూర్తి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్