Gudur: గూడూరు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన

Gudur: సిఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని గూడూరు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన. పారదర్శక ఎన్నికల కోసం వినతిపత్రం అందజేత.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 6:10 PM IST
Gudur
X

Gudur: గూడూరు ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిరసన

గూడూరు: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారు వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ గూడూరు RDO కార్యాలయం ఎదుట నిరసన సన చేసి RDO కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇవటం జరిగింది.

భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థ. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతున్నాయనే విశ్వాసం ప్రతి ఓటరులో ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం.

ఎన్నికల సంఘం వ్యవహారశైలికి సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రజలు వ్యక్తం చేస్తున్న వివిధ అభ్యంతరాలు మరియు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత మరియు నిష్పక్షపాతిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది.

ఈ నేపథ్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) తరఫున డిమాండ్ చేస్తున్నాము.

కావున, ఈ వినతిపత్రాన్ని స్వీకరించి, మా డిమాండ్‌ను సంబంధిత ఉన్నతాధికారుల మరియు భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము.

ప్రజాస్వామ్య విలువలు, ఓటర్ల హక్కులు మరియు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర ఐయన్ టి యు సి అధ్యక్షులు పూల చంద్ర శేఖర్,గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య, మాజీ జిల్లా ప్రదాన కార్యదర్శి చిలుకూరి వేమయ,రాష్ట్ర బిసి విభాగం కార్యదర్శి రావూరి బ్రహ్మయ్య, జిల్లా బిసి విభాగం నాయకులు గంటమడుగు సుబరామరాజు,స్వతంత్రసమరయోదులు మరియు సైదాపురం మండల అధ్యక్షులు మురారి కృష్ణయ్య,యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్,ముత్తుకూరు మండలం కాంగ్రెస్ అధ్యక్షులు అంకయ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్