Gudur: తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు సీడీపీఓ మెహబూబి

Gudur: గూడూరులో పోషణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సీడీపీఓ మెహబూబి సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 6:31 PM IST
Gudur
X

Gudur: తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు సీడీపీఓ మెహబూబి

గూడూరు: తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆహారాన్ని గర్భిణీలు తీసుకోవాలని గూడూరు ఐసిడిఎస్ అర్బన్ సిడిపిఓ మెహబూబి తెలిపారు.

గూడూరు ఐసీడీఎస్‌ అర్బన్ పరిధిలోని బ్రహ్మంగారిమఠం లో ఉన్న అంగన్వాడి కేంద్రం సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు నిర్వహించనున్న పోషణ మాసోత్సవాలను శుక్రవారం సీడీపీఓ మహబూచి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా గాంధీ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ మహబూచి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. గర్భిణులు రక్తహీనతకు గురికాకుండా మునగాకు, ఆకుకూరలు, పాలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. కిషోర బాలికలు కూడా చిన్ననాటి నుంచే సమతుల్య ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.

చిరుధాన్యాలు, కూరగాయలు, సీజనల్‌ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని తల్లులు,బాలింత లకు అంగన్‌వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఫ్రీ స్కూల్ పిల్లల ప్రజలకు అంగన్వాడి కార్యకర్తలు శాలువాలు కప్పి చప్పట్లతో సత్కరించారు అదేవిధంగా పిల్లల తల్లులు కూడా అంగన్వాడి కార్యకర్తలను సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు వై. రాజేశ్వరి, జి. సుధా మాధురి, ఏ ఎల్ నారాయణమ్మ, కే. శ్రీదేవి, ఎం. రేవతి మరియు అంగనవాడి సహాయ కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్