Gudur: బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలి: బీఎస్పీ

Gudur: స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గూడూరులో పూలే విగ్రహాల సాక్షిగా బీఎస్పీ, బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Oct 2026 6:14 PM IST
Gudur
X

Gudur: బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలి: బీఎస్పీ

నెల్లూరు జిల్లా: గూడూరు కార్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి విగ్రహాల వద్ద సోమవారం బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై దినపత్రికలు. ఎలక్ట్రానిక్ మీడియా మీడియా వారితో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ అమలపరచటంలో అన్యాయం జరిగిందని.

ఎల్వి సుబ్బయ్య మరియు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ... పలు కుల సంఘ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో పలువురు బిసి నాయకులు మాట్లాడుతూ ఓట్లు మావి సీట్లు మీకా అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట ఇది తగునా ఆగ్రవర్ణ రాజకీయ నాయకుల్లారా బిసిల ఓటుతో అధికారంలోకి వచ్చి ఎనిమిది దశాబ్దాలుగా బీసీలను బానిసత్వంలో ముంచుతున్న పాలకులు అగ్రకుల పాలకుల దుర్మార్గాలు బీసీలు పై దాడులు అధికంగా జరుగుతున్నాయని అవి అరికట్టడంలో పూర్తిగా విఫలమై ఉన్నారని బిసిలరక్షణ చట్టం అమలు చేయలేదని కులగణన మూలన పెట్టారని.

50 శాతంబిసిల రిజర్వేషన్ కోసం ఎన్నో ధర్నాలు నిరాహార దీక్షలు ఢిల్లీలో చేశారని కేంద్ర ప్రభుత్వానికి బీసీల తమ వాదన వినిపించారని కానీ 50 శాతం రిజర్వేషన్ కోసం ఎన్నో ధర్నాలు చేస్తే చివరికి నేటి కూటమీ ప్రభుత్వం కేవలం 34 శాతం రిజర్వేషన్ను ప్రకటించడం జరిగిందని కానీ అది కూడా హైకోర్టు కొట్టి వేసిందని ఇది దారుణమని నేడు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల కోసమే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చామని ఎన్నికల డ్రామా ఆడారని కానీ నేడు హైకోర్టు బీసీల రిజర్వేషన్ కేసు కొట్టివేయటం జరిగిందని నేటి రాష్ట్ర కూటమీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళామని బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించి ఉన్నారనీ బీసీలు చూస్తూ ఊరుకోరని రానున్నఎన్నికల్లో తగిన సమాధానం బీసీలు తగిన సమాధానం ఇస్తారని.

బిసిల రక్షణ చట్టం ఏమైందని చట్టం అమలు ఏమైందని. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఇంకా ఈ దేశంలో బీసీలకు స్వాతంత్రం రాలేదని. స్థానిక ఎన్నికల్లో జరిగే లోపల 50 శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే బీసీల సత్తా ఏమిటో త్వరలో స్థానిక ఎన్నికల్లో బీసీల తడాఖా చూపిస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని నిత్యం టిడిపి అంటే బీసీల పార్టీ బీసీలు అంటేనే టిడిపి అని చెబుతూ ఉంటారు కదా మరి ఆ మేరకు బీసీల మీద ప్రేమే ఉంటే ఎన్ డి ఏ కూటమీ ఆధ్వర్యంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా మరి చంద్రబాబు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తాను.

తేదీ. 9/7/2012 ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న హామీని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టించి అమలు చేసి చేసి ఉండాలి కదా? కోర్టు34 శాంతంనుంచి24. శాంతానికి తగ్గించడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లు 50% దాటకూడదని కోర్టు సారాంశం మరి అది తెలిసి కూడా చంద్రబాబు గారు 2024 లో ఎన్నికల్లో బీసీలకు స్థానిక సంస్థలలో 34.శాతం అమలు చేస్తామని పొందుపరిచారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు 34 శాతం అమలు చేస్తే 50% దాటుతుందని అమలు చేసిన 50 శాతం అమలు చేసిన 50% దాటుతుంది.

కీర్తిశేషులు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు ఆ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమలు చేయుటకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారినీ ఒప్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలులెలో పెట్టించి అమలు చేసిన విధంగా చంద్రబాబు గారు కూడా ఈ విధంగా చేయాలి అని డిమాండ్ చేశారు రిజర్వేషన్ బీసీలకు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.

మాట్లాడినవారు. ఎల్వి సుబ్బయ్య, నాశిన భాస్కర్ గౌడ్. తిరగాబతిన శేషయ్య గౌడ్. జి వెంకటేశ్వరరాజు, గెరిటి నారాయణ. సీనయ్య నవీన్. తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్