Gudur: గూడూరు ఏరియా ఆసుపత్రిలో సేవా పఖ్వాడా వైద్య శిబిరం

Gudur: గూడూరు ఏరియా ఆసుపత్రిలో సేవా పఖ్వాడా ముగింపు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2026 2:16 PM IST
Gudur
X

Gudur: గూడూరు ఏరియా ఆసుపత్రిలో సేవా పఖ్వాడా వైద్య శిబిరం

గూడూరు: గూడూరులో సేవా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపడుతున్న సేవా పఖ్వాడా కార్యక్రమాల్లో భాగంగా, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గూడూరులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ క్యాంప్ లో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మెడికల్ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రక్తదానం, ఆరోగ్య పరీక్షలు వంటి సేవల్లో ముందుకు రావాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. సేవే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ షరీనా ఆర్ఎంవో బి ప్రసన్న , హాస్పిటల్స్ సిబ్బంది స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్