Nellore: నరసింహకొండపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!

Nellore: నెల్లూరు రూరల్ నరసింహకొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

A Praveen, Nellore
Published on: 11 Oct 2026 10:43 PM IST
Nellore
X

Nellore: నరసింహకొండపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం!

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం శ్రీ వేదగిరి క్షేత్రముగా వెలసి ఉన్న వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండపై శరన్నవరాత్రి ఉత్సవములలో భాగముగా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం మరియు మొదటి రోజు అమ్మవారికి ఆది లక్ష్మి అలంకారము, శ్రీసూక్త హోమము అత్యంత వైభవంగా జరిగింది.

దేవి శరన్నవరాత్రులు సందర్భముగా దేవస్థానములో ఈనెల 11 వ తేదినుండి 20 వ తేదీ వరకు శ్రీ ఆది లక్ష్మి అమ్మవారు విశేష అలంకారములలో భక్తులకు దర్శనమిస్తారని చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర రెడ్డి మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగముగా మొదటి రోజు శ్రీ ఆది లక్ష్మి అలంకారము, రెండవ రోజు శ్రీ ధాన్య లక్ష్మిగా మూడవ రోజు శ్రీ ధైర్య లక్ష్మి గా,

నాలుగవ రోజు శ్రీ గజ లక్ష్మిగా, ఐదవ రోజు శ్రీ సంతాన లక్ష్మీగా, ఆరవ రోజు శ్రీ విజయలక్ష్మి గా, ఏడవ రోజు మూలా నక్షత్రము శ్రీ సరస్వతి అమ్మవారుగా, ఎనిమిదవ రోజు శ్రీ విద్యా లక్ష్మీగా, తొమ్మిదవ రోజు శ్రీ ధనలక్ష్మీగా మరియు 20 వ తేదీన విజయ దశమి రోజు శ్రీ ఆది లక్ష్మీ అమ్మవారు శ్రీ స్వామివారితో కలసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అలంకారములో దర్శనమివ్వనున్నారని వారు తెలిపారు.

విజయ దశమి రోజున శ్రీ స్వామివారు పార్వేట ఉత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో ముఖ్య అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు, అర్చకులు మాధవగిరి వెంకట అప్పలాచార్యులు, మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు, మాధవగిరి నరసింహ మూర్తి, అంగులూరి రమానాధాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించినారు. భక్తులందరినీ ఆహ్వానించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore