Nellore: శ్రీ భవానీ దేవి అలంకారంలో భువనేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం!

Nellore: నెల్లూరు మూలాపేట శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి.

A Praveen, Nellore
Published on: 11 Oct 2026 10:38 PM IST
Nellore
X

Nellore: శ్రీ భవానీ దేవి అలంకారంలో భువనేశ్వరి అమ్మవారి దివ్య దర్శనం!

నెల్లూరు: నెల్లూరు మూలాపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సందర్భంగా తొలిరోజైన ఆదివారం నాడు ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆలయంలో వేకువజాము నుంచే స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

ఈ మహోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ అజయ్ కుమార్, కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డిల పర్యవేక్షణలో కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఉత్సవాల తొలిరోజు సందర్భంగా భక్తులను అలరించేందుకు ఆలయ ప్రాంగణంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేశారు. దసరా నవరాత్రుల ప్రారంభ వేడుకల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు, అర్చకులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore