Nellore: తొలిరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దివ్య దర్శనం!
Nellore: నెల్లూరు మూలాపేట శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
Nellore: తొలిరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దివ్య దర్శనం!
నెల్లూరు: నెల్లూరు మూలాపేటలో వేంచేసియున్న శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానములో శ్రీ దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం కలశ స్థాపన ఉభయకర్తలు శ్రీమతి & శ్రీ కోసూరు రాజశేఖర్ గారి దంపతులు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యుల గారి సతీమణి శ్రీమతి సుజితమ్మ గారు,
మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఒట్టూరు సురేంద్రయాదవ్ గారు మరియు కమిటీ సభ్యులు, కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ గారు భక్తుల సమక్షంలో గణపతి పూజ, కలశ స్థాపన మంగళవాయిద్యములతో, వేదమంత్రాలతో ప్రదక్షణగా వైభవోపేతంగా జరిగింది. అనంతరం సాయంత్రం శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకారణతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారముతో దర్శనమిచ్చారు.
సాయంత్రం చండీయాగం మరియు లక్ష కుంకుమార్చన,పల్లకిసేవ మరియు దసరా ఉత్సవాలలో నిత్య ప్రసాద దాతలు (ఉదయం, సాయంత్రం )శ్రీమతి £ శ్రీ కాకులూరి వసంతకుమార్ గారు శ్రీమతి కర్పగవల్లి గార్లచే ప్రసాదవినియోగం జరిగినది-సాంస్కృతిక కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగినాయి.
పై కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు శ్రీమతి అల్లం లక్ష్మి గారు, శ్రీ తమ్మినేని వెంకటరత్నం నాయుడు గారు, శ్రీ కొండా కోటేశ్వరరెడ్డి గారు, శ్రీ గుడ్డేటి చెంచయ్య గారు, శ్రీ కుమార్ హరికుమార్ గారు, శ్రీమతి మన్నేపల్లి వెంకటలక్ష్మిప్రసూనా గారు, శ్రీ ముమ్మిడి కుమార్ గారు, శ్రీమతి మిడతల మహాలక్ష్మి గారు, శ్రీ పులికొలను చంద్రశేఖర్, ముఖ్య అర్చక గారు. పాల్గొనడం జరిగినది.




