Tellapadu: తెల్లపాడులో ఘనంగా భద్రకాళి అమ్మవారి దసరా ఉత్సవాలు

Tellapadu: కలిగిరి మండలం తెల్లపాడులో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి దసరా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలతో వైభవంగా జరిగాయి.

V. Kamaiah, Vinjamuru
Published on: 20 Oct 2026 4:08 PM IST
Tellapadu
X

Tellapadu: తెల్లపాడులో ఘనంగా భద్రకాళి అమ్మవారి దసరా ఉత్సవాలు

కలిగిరి: కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.తొమ్మిది రోజులపాటు అమ్మవారికి వివిధ రకాల విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వివిధ అలంకరణల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లపాడు గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో తీర్థప్రసాదాలు స్వీకరించారు.దసరా ఉత్సవాలతో తెల్లపాడు గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,ఆలయ ధర్మకర్త జూపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మవారి దసరా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు, మహిళలు,పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru