Nellore: జాతి నిర్మాణంలో గాంధీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్సీ బీద

Nellore: నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నివాళులర్పించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 2 Oct 2026 4:20 PM IST
Nellore
X

Nellore: జాతి నిర్మాణంలో గాంధీ, శాస్త్రి సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్సీ బీద

Nellore: జాతిపిత మహాత్మా గాంధీ, భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి ని పురస్కరించుకొని వారి చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు శాసనమండలి సభ్యులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర పూలమాలతో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా బీద మాట్లాడుతూ...

బ్రిటీష్ చెర నుండి దేశానికి విముక్తి కలిగించి ప్రజలకు స్వాతంత్ర ఫలాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, మహాత్మా గాంధీ ఆశయాలు, ఆలోచనలు భావి తరాలకు ఆదర్శనీయం అని, వారు చూపిన సత్యం, శాంతి, అహింస మార్గాలు ఆచరణీయం అని అన్నారు... గాంధీ ఆశయాల సాధనకై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు.

మహాత్మా గాంధీ ఆలోచనలను స్ఫూర్తి తీసుకుని స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర వంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్య పరుస్తున్నారని చెప్పారు.

యుద్దాలు, ఉగ్రవాదం, దాడులతో ప్రపంచ పరిస్థితులు ప్రమాదకరం గా పరిణమించిన తరుణంలో మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గం ఉత్తమ పరిష్కారం అని అన్నారు.

దేశ ప్రధానిగా ఆదర్శవంతమైన పాలన అందించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి. వారి ఆలోచనలు, విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.

జై జవాన్! జై కిసాన్!! నినాదంతో దేశ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు.. భారతదేశానికి విశిష్ట సేవలను అందించిన ఇరువురు మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నామని, వారి ఆశయాల సాధనకు పునరంకితం అవుతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పాలిశెట్టి , జెన్ని రవణయ్య, చెంచల బాబు యాదవ్, ధర్మవరపు సుబ్బారావు, పి యల్ రావు, ఊరందూరు సురేంద్ర బాబు, ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, నన్నే సాహెబ్, దర్శి హరికృష్ణ, షేక్ అమృల్లా, ఆశం సురేష్,బ్రహ్మం గుప్తా, జ్ఞానేంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE