Nellore: ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై నిరసన

Nellore: గాంధీ జయంతి రోజున ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై వ్యవసాయ కార్మిక సంఘం, వామపక్ష నాయకులు నిరసన తెలిపారు. బీజేపీ విధానాలను ఎండగట్టారు.

V. Narasimhulu, Nellore
Published on: 2 Oct 2026 7:10 PM IST
Nellore
X

Nellore: ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై నిరసన

నెల్లూరు: గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని గాంధీ బొమ్మ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నంది పోగు రమణయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా వ్యవసాయ కూలీలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.

అయితే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి వ్యవసాయ కూలీలు నోట్లు మట్టి కొట్టాలని బిజెపి ప్రభుత్వం పన్నాగం రచిస్తుంది అందులో భాగంగానే ఈ చట్టం పేరును సైతం వివిజి రాంజీగా పేరు మార్చి వ్యవసాయ కూలీలు అన్యాయం చేస్తుంది మహాత్మా గాంధీని చంపిన గాడ్సే పేరును ఈ ఉపాధి హామీ చట్టాన్ని గాడ్సే పేరు పెట్టాలని బిజెపి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు.

బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో మత రాజకీయాలు కుల రాజకీయాలు తప్ప అభివృద్ధి ఎక్కడ లేదు దోచుకోవడంలో నెంబర్ వన్ స్థానంలో బిజెపి ఉంది చివరికి వ్యవసాయ కూలీలను సైతం వేధిస్తున్నారు ఇప్పటికైనా బిజెపి తన వైఖరిని మార్చుకొని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షానవాజ్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహ్మద్, సిపిఐ నాయకులు జిల్లాని ఖాన్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా, సిపిఐ రూరల్ మండల సహాయ కార్యదర్శి ఆదినారాయణ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గుది విజయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కామేశ్వరరావు, షబ్బీర్, షాజహాన్, మున్వర్, షాకీర్, నూరి తదితరులు పాల్గొన్నారు

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore