Nellore: ఎన్జీవో హోంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
Nellore: ఎన్జీవో హోంలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Nellore: ఎన్జీవో హోంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
Nellore: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బండారిపల్లి వెంకటేశ్వర్లు కార్యదర్శి గాదిరాజు రామకృష్ణ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా గాంధీజీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ నిబద్దతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు...
ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్ ఆంజనేయ వర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ పెంచలయ్య, ఉపాధ్యక్షులు కే రాజేంద్రప్రసాద్, పి సతీష్ బాబు , టి మల్లికార్జున్ రావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ వీరబ్రహ్మేశ్వరరావు, ఎన్ రాజేంద్ర, సిటీ అధ్యక్షులు చిలక రామకృష్ణారెడ్డి, కార్యదర్శి ఏవి కృష్ణ కుమార్, జాయింట్ సెక్రెటరీ కె అన్నపూర్ణ, మహిళా చైర్ పర్సన్ ఎల్ నవోదయ, మరియు పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




