Gudur: గూడూరు ఎస్.కె.ఆర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
Gudur: గూడూరు ఎస్.కె.ఆర్ విద్యా సంస్థలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు. అహింస, సత్యం ద్వారా సమాజ వికాసం సాధ్యమని ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు.
Gudur: గూడూరు ఎస్.కె.ఆర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
గూడూరు: గూడూరు పట్టణంలోని ఎస్. కె.ఆర్ ప్రభుత్వ పాఠశాల నందు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ అధ్వర్యంలో నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామ్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింస, సత్య గ్రహం , మానవ సేవే అనే మూడు అంశాలను ఆయుధంగా చేసుకొని శత్రువులను హింస మార్గంలో కాకుండా అహింస మార్గంలో గెలవాలని కోరారు. హింస మానవ జాతి నీ సర్వ నాశనం చేస్తుందన్నారు. గాంధీజీ సేవా భావాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థుల కు వ్యాస రచన , వక్రుత్వపు పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఐ. క్యూ.సి . కో ఆర్డినేటర్ యశోదా, లావణ్య, సురేంద్ర, రమణా రెడ్డి, వాసంతి, తదితరులు పాల్గొన్నారు.




