Gudur: గూడూరు బాలాజీ నగర్‌లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరులో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ. హాజరైన ప్రముఖులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 4:06 PM IST
Gudur
X

Gudur: గూడూరు బాలాజీ నగర్‌లో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం!

Gudur: నెల్లూరు జిల్లా గూడూరు బాలాజీ నగర్‌లోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు శ్రీ పొణకా ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం, వారి కుమారుడు పొణకా మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహకారంతో ప్రతి నెల చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ జరిగింది. సమాజంలోని 15 నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసి, వారికి 18 రకాల నిత్యావసర సరుకులను (పలసరుకులు) అందజేశారు.

ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడవేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ "పేదరికంలో ఉన్నవారికి చేయూతనందించడమే మానవత్వానికి నిజమైన అర్థం. శ్రీ పొణకా ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు ముందుకు వచ్చి ఈ సాయం అందించడం అభినందనీయం. దాతల సహకారంతోనే ప్రగతి సేవా సంస్థ ద్వారా నిరంతరం ఇటువంటి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాం" అని తెలిపారు.

అనంతరం ఏపీ స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీ జి ప్రతాప్ మాట్లాడుతూ నేను సౌత్ ఇండియా మొత్తం తిరిగాను ఎన్నో సంస్థల్లో పాల్గొన్నాను కానీ ఇలాంటి ఒక సేవా సంస్థ చేస్తున్న ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ పాల్గొనటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి నెల నిరుపేదలకు ఆసరాగా నిలవడం సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీ జి ప్రతాప్, గూడూరు స్కేటింగ్ కోచ్ విజిత్ స్కేటింగ్ స్టూడెంట్స,ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్