Nellore: నెల్లూరు ముమ్మరంగా సాగుతున్న 'పల్లె పండుగ' వేదిక ఏర్పాట్లు!

Nellore: నెల్లూరు జిల్లా రామాపురంలో ఈ నెల 29న జరగనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే మేకపాటి పరిశీలించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 26 Sept 2026 1:37 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు ముమ్మరంగా సాగుతున్న 'పల్లె పండుగ' వేదిక ఏర్పాట్లు!

Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ఈనెల 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రామాపురంలో పర్యటించి సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.సభా ప్రాంగణం, వేదికతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.ఈనెల 29న రామాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI