Atmakur: తొలిసారిగా వినాయక నిమజ్జనోత్సవాలకు ఘన స్వాగతం..మంత్రి ఆనం ప్రత్యేక ఏర్పాట్లు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తొలిసారిగా వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రత్యేక స్వాగత వేదిక ఏర్పాటు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 17 Sept 2026 7:47 AM IST
Atmakur
X

Atmakur: తొలిసారిగా వినాయక నిమజ్జనోత్సవాలకు ఘన స్వాగతం..మంత్రి ఆనం ప్రత్యేక ఏర్పాట్లు!

Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ చరిత్రలో తొలిసారిగా వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా గణనాథునికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు స్వాగత వేదికను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు దక్కింది.

వినాయక నిమజ్జనోత్సవంలో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే గణనాథుని విగ్రహాలకు ఘన స్వాగతం పలికి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్ వద్ద ప్రత్యేక స్వాగత వేదికను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలు,మార్గదర్శకత్వంలో గణేష్ ఉత్సవ కమిటీ,ఎన్డీఏ కూటమి నాయకులు బిజెపి,జనసేన, టీడీపీ శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షించారు. నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య, క్రమశిక్షణతో జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

ఆత్మకూరులో వినాయక నిమజ్జనోత్సవాలకు ఈ తరహాలో ప్రత్యేక స్వాగత వేదికను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. “గణపతి బప్పా మోరియా” నినాదాల మధ్య గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఆత్మకూరు లో వేదిక ఏర్పాటు పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)