Podalakuru: పొదలకూరులో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మొదటి చాటింపు!

Podalakuru: పొదలకూరులో ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మొదటి చాటింపు. వచ్చే నెల 6 నుంచి జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు, భక్తులు.

Yellayya, Nellore
Published on: 23 Sept 2026 11:13 AM IST
Podalakuru
X

Podalakuru: పొదలకూరులో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మొదటి చాటింపు!

Podalakuru: పొదలకూరు గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందడి మొదలైంది.జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి చాటింపుతో జాతర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు.

వెంకటగిరి పోలేరమ్మ జాతర సంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడి జాతరను 90 ఏళ్ళ తర్వాత నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మండల పెద్దలు, జాతర కమిటీ సభ్యులు,భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా చాటింపు కార్యక్రమాన్ని చేపట్టారు. సంగం రోడ్డు కూడలి, రామమందిరం సెంటర్, గేట్ సెంటర్ తదితర ప్రధాన కూడళ్లలో చాటింపు వేశారు. దీంతో గ్రామంలో జాతర సందడి మరింత ఊపందుకుంది.

వచ్చేనెల 6 నుంచి జాతర వైభవం

వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో భాగంగా ఘటోత్సవం, నిలుపుదల, గ్రామోత్సవం, నిమజ్జనం తదితర కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలేరమ్మ తల్లి జాతరను సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

Yellayya, Nellore

Yellayya, Nellore