Nellore: కారుణ్య నియామకం త్వరగా చేపట్టండి: కలెక్టర్‌కు ఆవాజ్ వినతి

Nellore: ఆర్ అండ్ బీ కార్యాలయంలో షేక్ జియా ఉల్ హాక్‌కు రావాల్సిన కారుణ్య నియామకాన్ని త్వరగా చేపట్టాలని ఆవాజ్ కమిటీ నెల్లూరు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 5 Oct 2026 6:41 PM IST
Nellore
X

Nellore: కారుణ్య నియామకం త్వరగా చేపట్టండి: కలెక్టర్‌కు ఆవాజ్ వినతి

Nellore: ఆర్ అండ్ బి ఆఫీసులో షేక్ జియా ఉల్ హాక్ కు వాళ్ల అమ్మ తరువాత రావాల్సిన కారుణ్య నియామకం త్వరగా చేపట్టాలని ప్రజా విజ్ఞప్తుల దినంలో ఆవాజ్ నెల్లూరు జిల్లా కమిటీ కలెక్టర్ కి విన్నవించింది.

ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా, అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ రఫీ, షేక్ రషీద్ లు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆర్ అండ్ బి ఎస్ఇ గారు కారుణ్య నియామకం చేపట్టకుండా షేక్ జియా ఉల్ హాక్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.

కారుణ్య నియామకం త్వరగా చేపట్టే షేక్ జియా ఉల్ హాక్ కు న్యాయం చేసే విధంగా చూడాలని అలాగే ఆర్ అండ్ బి లో షేక్ జియా ఉల్ హాక్ కు న్యాయం చేసే విధంగా చూడాలని అలాగే ఆర్ అండ్ బి లో జరుగుతున్న పరిణామాలపై విచారణ కూడా జరిపించాలని కలెక్టర్ గారిని కోరామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆవాజ్ సభ్యులు మహామ్మద్ అబ్దుల్ అజీజ్, షేక్ షంషాద్, షేక్ షానవాజ్, కారుణ్య నియామక భాదితుడు షేక్ జియా ఉల్ హాక్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE