Nellore: అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం!
Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, స్థానిక ఎన్నికలపై సమీక్ష.
Nellore: అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం ప్రారంభం!
Nellore: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో వైసిపి కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రారంభించారు.అనంతసాగరం మండల కేంద్రానికి విచ్చేసిన విక్రమ్‌రెడ్డికి పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం అనంతసాగరం మండలానికి చెందిన పార్టీ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడెంటీ కార్డులను పంపిణీ చేశారు.మండలంలోని పార్టీ కార్యకలాపాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు,ఉదయగిరి నియోజకవర్గాల వైసీపీ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి,కూనం సుధాకర్‌రెడ్డి,అనంతసాగరం మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




