Nellore: ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

Nellore: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 24 Sept 2026 4:28 PM IST
Nellore
X

Nellore: ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

Nellore: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు.

గురువారం నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు ఈవీఎం గోడౌన్ల వద్ద అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విజయ్ కుమార్, టిడిపి, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిథులు, ఎలక్షన్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE