Nellore: విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదం ప్రాణాలు కోల్పోయిన రమేష్!
Nellore: నెల్లూరు జిల్లా వాకాడులో కరెంట్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా అదుపుతప్పి కిందపడి రమేష్ అనే కార్మికుడు మృతి చెందాడు.
Nellore: విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదం ప్రాణాలు కోల్పోయిన రమేష్!
Nellore: నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కరెంట్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా అదుపుతప్పి కిందపడి రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వాకాడు గ్రామంలో చోటుచేసుకుంది. సుమారు 20 అడుగుల ఎత్తు నుండి తల కిందులుగా పడటంతో తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం అయ్యింది. స్థానికులు వెంటనే స్పందించి చూడగా అప్పటికే 33 ఏళ్ల రమేష్ ప్రాణాలు విడిచినట్లు గుర్తించారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రమేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
రమేష్ కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో గ్రామంలో విషాద వాతావరణం అలుముకుంది.సమాచారం అందుకున్న వాకాడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా కరెంట్ స్తంభాలు ఎక్కడం ప్రాణాలకే ప్రమాదమని కరెంట్ పనులు చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




