Gudur: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఐ
Gudur: ఓటు చోరీకి పాల్పడిన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని గూడూరులో సీపీఐ సీనియర్ నాయకులు సి.వి.ఆర్ కుమార్ డిమాండ్ చేశారు.
Gudur: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఐ
గూడూరు: ఓటు చోరీ కి పాల్పడిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ సీనియర్ నాయకులు సి .వి.ఆర్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజధాని డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఓటు చోరీ కి పాల్పడిన భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను రాజీనామా చేయాలని సి.జె.పి అధ్వర్యంలో వామ పక్ష పార్టీ లు , విద్యార్థి సంఘాలు , విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి నీ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అన్నారు. తప్పు చేసిన జ్ఞానేశ్ కుమార్
కు అందలం... ప్రశ్నించే గొంతుకు ల పై అణచివేత ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే పోలీసులు సీపీఐ , వామపక్ష నాయకులు , విద్యార్థి సంఘ నాయకులను అదుపులోకి తీసుకొని వాళ్లను నిర్బంధించడం ఎంత వరకు సబబు అన్నారు.
ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసే వరకు పోరాటం సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణి కి ప్రజలు అందరూ ఏకమై ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలన్నారు . ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కన్వీనర్ యాదాల సునీల్, ఏ. ఐ. వై.ఎఫ్ జిల్లా నాయకులు సి.వి.ఎల్, మస్తాన్, మహీర్ , తదితరులు పాల్గొన్నారు.




