Duthalur: టీడీపీ అభ్యర్థులను గెలిపించండి: కాకి శ్రీనివాసులు
Duthalur: దుత్తలూరు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాకి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
Duthalur: టీడీపీ అభ్యర్థులను గెలిపించండి: కాకి శ్రీనివాసులు
నెల్లూరు జిల్లా: దుత్తలూరు మండలం రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాకి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. దుత్తలూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం అందించారని పేర్కొన్నారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా మండలంలోని ఎస్సీ కాలనీల్లో ఎంఆర్‌పీఎస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు కాకి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సెక్రటరీ ఇమ్మానియేలు పాల్గొన్నారు.




