Atmakur: అక్టోబర్ 13న పవన్ కళ్యాణ్‌చే ఆత్మకూరు బైపాస్ ప్రారంభం

Atmakur: రూ.8.91 కోట్లతో నిర్మించిన ఆత్మకూరు 4 లేన్ల బైపాస్ రోడ్డును అక్టోబర్ 13న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభిస్తారని మంత్రి ఆనం తెలిపారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 11 Oct 2026 8:45 PM IST
Atmakur
X

Atmakur: అక్టోబర్ 13న పవన్ కళ్యాణ్‌చే ఆత్మకూరు బైపాస్ ప్రారంభం

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మకూరు బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి.

సుమారు రూ.8 కోట్ల 91 లక్షల వ్యయంతో బైపాస్ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడంతో పాటు సెంట్రల్ లైటింగ్, రహదారి సుందరీకరణ, ప్లాంటేషన్ తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు.

ఈ నూతన నాలుగు లేన్ల బైపాస్ రహదారిని అక్టోబర్ 13వ తేదీ మంగళవారం ఉదయం 11:00 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రారంభోత్సవ సభను నిర్వహిస్తున్నామని... మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోరారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)