Duttalur: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు – స్పందించిన టీడీపీ నేత!

Duttalur: దుత్తలూరు వద్ద రోడ్డుపైకి బర్రెలు రావడంతో కారు బోల్తా. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు. తక్షణమే స్పందించి 108లో ఆసుపత్రికి తరలించిన టీడీపీ నేత మన్నేటి.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 26 Oct 2026 11:55 PM IST
Duttalur
X

Duttalur: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు – స్పందించిన టీడీపీ నేత!

దుత్తలూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపైకి ఒక్కసారిగా బర్రెలు రావడంతో వాటిని తప్పించబోయిన కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి వింజమూరు మండలం సండ్రపడియా వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన నాయుడుతో పాటు ఆయన కుమారుడు పవన్ తీవ్రంగా గాయపడ్డారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకుడు మన్నేటి వెంకటరెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. తన వాహనాన్ని పక్కకు ఆపి క్షతగాత్రులకు సహాయం అందించడంతో పాటు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

అలాగే దుత్తలూరు ఎస్సై మహేంద్రకు ప్రమాదం గురించి తెలియజేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేంద్ర వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అంబులెన్స్ వచ్చే వరకు క్షతగాత్రుల వద్దే ఉండి వారికి ధైర్యం చెప్పిన మన్నేటి వెంకటరెడ్డి, వారిని వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించే వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్పందించి క్షతగాత్రులకు అండగా నిలిచిన మన్నేటి వెంకటరెడ్డి మానవత్వాన్ని స్థానికులు అభినందించారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI