Nellore: రాపూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ!
Nellore: రాపూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఏటూరు వందన గెలుపు కోసం యువజన నేత డాక్టర్ రేవంత్ చక్రవర్తి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Nellore: రాపూరు మేజర్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏటూరు వందన విజయమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ మేరీగ రేవంత్ చక్రవర్తి వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందనతో పాటు వైఎస్సార్సీపీ బలపరిచిన వార్డు సభ్యుల అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.
రాపూర్ మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీకి బలమైన ప్రజాదరణ ఉందని, ఆ బలాన్ని సర్పంచ్ ఎన్నికల్లో విజయంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందని డాక్టర్ రేవంత్ చక్రవర్తి పేర్కొన్నారు.నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ విధానాలను, అభ్యర్థుల విజయ లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. సర్పంచ్ అభ్యర్థి ఏటూరు వందనతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థుల విజయానికి తన వంతు సహకారం అందిస్తూ శాయశక్తులా కృషి చేస్తానని ఆయన తెలిపారు.




