Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో ఉత్సాహంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో కూటమి ఇంటింటి ప్రచారం. 18 నెలల్లో నగర సమస్యలకు మంత్రి నారాయణ పరిష్కారం చూపుతారని హామీ.
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో ఉత్సాహంగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!
Nellore: నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ (పాత 16వ డివిజన్) పరిధిలో కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారు స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, 18 నెలల్లో శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని ఇచ్చిన హామీని ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
ముఖ్యంగా, డిసెంబర్ నెలాఖరులోపు అండర్‌డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు దోమల బెడదను తగ్గించి, నెల్లూరు నగరాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు.
ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానికుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ప్రచార బృందానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. “మీరు మాకు తెలుసు… కూటమికే మా మద్దతు, మా ఓటు” అంటూ పలువురు స్థానికులు ఆత్మీయంగా స్పందించడం ప్రచార బృందంలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ప్రజల నమ్మకమే మా బలం… అభివృద్ధే మా లక్ష్యం… ప్రజాసేవే మా మార్గం.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, ప్రవల్లిక, విజయ, కృష్ణవేణి, శ్రీలక్ష్మి, మల్లిరెడ్డి, నరహరి, నాగేంద్ర బాలు, ప్రశాంతి, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




