Nellore: వైసీపీకి మరో అవకాశం ఇవ్వొద్దు: నెల్లూరులో జనసేన ప్రచారం

Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 2 Oct 2026 8:56 PM IST
Nellore
X

Nellore: వైసీపీకి మరో అవకాశం ఇవ్వొద్దు: నెల్లూరులో జనసేన ప్రచారం

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌ పరిధి లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం నేడు కూడా ఉత్సాహంగా సాగింది. ప్రతి గడపను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సామాన్యుడికి రాజ్యాధికారం, మహిళలకు ప్రాధాన్యత, వెనుకబడిన వర్గాలకు చేయూత, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నగర అభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, నెల్లూరును మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల్లో కూడా ప్రజల సహకారం అవసరమని తెలిపారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో పురోగమిస్తున్న తీరును కూడా ప్రస్తావించారు.

కంటికి కనిపించే అభివృద్ధి కావాలంటే.. కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు అవసరం అని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళలు విజయలక్ష్మి గునుకుల,కుమారి, ప్రవళ్లిక, కృష్ణవేణి, విజయ, ప్రశాంతి, సుప్రియ, లక్ష్మి, కల్పన, ప్రశాంత్ గౌడ్, నాగేంద్ర బాలు, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore