Nellore: ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: మంత్రి నారాయణ

Nellore: రాష్ట్ర, నెల్లూరు జిల్లా ప్రజలకు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు.

A Praveen, Nellore
Published on: 7 Nov 2026 4:41 PM IST
Nellore
X

Nellore: ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: మంత్రి నారాయణ

నెల్లూరు జిల్లా: చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు రాష్ట్ర, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..

ప్రజలంతా ఐకమత్యం, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిస్తూ, సుపరిపాలనతో రాష్ట్రాన్ని వికాస పథంలో నిలుస్తూ, అమరావతి నిర్మాణంతో పాటు ప్రతి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇస్తూ, ఈ పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో చిన్నారుల భద్రతపై తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు, అలాగే ఈ వెలుగుల పండుగ నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు, ఉత్సాహాన్ని నింపాలని మంత్రి నారాయణ గారు ఆకాంక్షించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore