Nellore: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా!

Nellore: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రారంభించి మాట్లాడారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 24 Oct 2026 10:42 AM IST
Nellore
X

Nellore: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా!

Nellore: రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ బొమ్మ నుంచి రెడ్ క్రాస్ కార్యాలయం వరకు చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే, మంచి చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది.

అందుకే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, ప్రతి మహిళకు ఈ విషయం తెలియాలని, మన ఇంట్లోనే కాకుండా, మన చుట్టూ ఉన్న మహిళలకు కూడా ఈ విషయాన్ని చెప్పాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం బలంగా ఉంటుందన్నారు.

మహిళల ఆరోగ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని, ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెడ్‌క్రాస్ సంస్థకు, వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE