Nellore: లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలోని పరమానంద ఆశ్రమాన్ని సందర్శించిన దేవానధ రామానూజ జీయర్ స్వామి. వేదపాఠశాల నిర్మాణ పనుల పరిశీలన.

Madhav Goud, Nellore
Published on: 29 Sept 2026 2:11 PM IST
Nellore
X

Nellore: లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు!

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం సమీపంలో వున్న పరమానంద ఆశ్రమాన్ని దేవనాధ రామానూజ జీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు, శ్రీరంగ పట్టణంలో రెండు నెలల పాటు చాతుర్మాష దీక్ష ముగించుకొని తిరుగు ప్రయాణంలో చిన్న జీయర్ స్వామి చూచనలతో ఆశ్రమంలో జరుగుతున్న వేదపాఠశాల నిర్మాణం మరియు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు,ముందుగా ఆశ్రమ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు, అనంతరం లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు,

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పెన్నానది ఒడ్డున ఎంతో చక్కగా ఈ ఆశ్రమాన్ని పరమానంద స్వామి నిర్మించారని తెలిపారు, ఈ క్షేత్రంలో వేదగోష వినపడాలనే ఉద్దేశంతో చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ కు ఈ ఆశ్రమాన్ని ఇచ్చారాని అన్నారు, ఆయన ఆశయాన్ని నేటికీ కొనసాగిస్తూ వేదపాఠశాల కొనసాగుతుందన్నారు,ఈ క్షేత్రం అంటే చిన్నజీయర్ స్వామి కి ఎంతో ఇష్టమని తెలిపారు, ఈ ప్రాంతం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు, ఈ కార్యక్రమం లో ఉభయ వేదాంతాచార్య పీఠం నెల్లూరు శాఖ అధ్యక్షుడు వేమారెడ్డి రఘునందన్ రెడ్డి, అర్చకులు రామాచార్యులు, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore