Nellore: నెల్లూరును కరవు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం మూలం రమేష్
Nellore: నెల్లూరును కరవు జిల్లాగా ప్రకటించి వెంటనే రూ.20 కోట్లు కేటాయించాలని, రైతులకు రుణమాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు.
Nellore: నెల్లూరును కరవు జిల్లాగా ప్రకటించాలి: సీపీఎం మూలం రమేష్
నెల్లూరు: నెల్లూరు జిల్లాను కరువు ప్రాంతoగా ప్రకటించాలని రైతులకు రుణమాఫీ, కౌలు రైతులకు నష్టపరిహారం, అన్ని పంటలకు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని, సి.పి.ఎం పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు.
కరువు పరిశీలనా బృందం జిల్లా పర్యటనలో భాగంగా కరువు బృందం నాయకులు గురువారం రోజు గూడూరు సి.పి.ఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పొదలకూరు, రాపూరు, సైదాపురం, మండలాల్లో రైతులు పంట పొలాలను పరిశీలించడం జరిగిందని, బొప్పాయి చెట్లు వైరస్ షోకి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, నిమ్మ రేట్లు పడిపోయాయని, కండలేరులో సాలినన్ని నీళ్లు లేవని ఒకపక్క కరువు మరోపక్క నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయని బియ్యం కేజీ 70 రూపాయలు, చక్కెర 72 లకు చేరుకొన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో, మండల ప్రాంతాల్లో సందర్శించిన దాఖలాలు లేవని, ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాని,పవన్ కళ్యాణ్ కాని,ప్రకటనలకే పరిమితం కాకుండా జిల్లాకి సహాయక చర్యల్లో భాగంగా 20 కోట్లు నిధులు కేటాయిస్తే తప్ప ఈ జిల్లా రైతాంగానికి సమస్యలు పరిష్కారం కావని,"ఎల్ నినో" ప్రభావంతో రైతులు వరి అయితే పూర్తిగా దెబ్బతిని పోయిందని, ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా పరిగనించి రాష్ట్రానికి లక్ష కోట్లు కేంద్ర నుంచి రాబడితే, తప్ప రైతాంగ సమస్యలు తీరవని "ఎల్ నినో" ప్రభావంగా రైతులు ఎదుర్కొనే దానికి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్రంలో సి.పి.ఎం పార్టీ పలు సమస్యలపై మూడు బృందాలుగా తిరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పై సమస్యలు పరిష్కారo చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన డిమాండ్ చేశారు.
సి.పి.ఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం మోహన్ రావు లు మాట్లాడుతూ కరువు పరిశీలనా బృందం పరిశీలనలో సైదాపురం లో బావులు, చెరువులు పూర్తిగా ఎండి పోయాయని,కరువు కాలుష్యం ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించకుండా కరువు నివారణ చర్యలు చేపట్టాలని ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో ప్రీమియం భీమా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, పంటల రుణాల్ని రైతులకు వెటనే రద్దు చేయాలని కరువు మండలాలు ప్రకటించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.పుల్లయ్య, మన్నూరు భాస్కరయ్య, సి.పి.ఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్, జిల్లా అవాజ్ కమిటీ సభ్యులు ఎస్కే. రషీద్, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు జోగి.శివకుమార్, పి.శ్రీనివాసులు, గూడూరు సి.ఐ.టి.యు పట్టణ కార్యదర్శి బి.వి.రమణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి. నారాయణ, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.




