Nellore: నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో ఇరిగేషన్ కాలువ పూడికతీత పనుల పరిశీలన!

Nellore: నెల్లూరు నగరంలోని 27వ డివిజన్ మాగుంట లేఅవుట్‌లో వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా ఇరిగేషన్ కాలువ పూడికతీత పనులను పరిశీలించిన కార్పొరేటర్ మదన్ కుమార్ రెడ్డి.

A Praveen, Nellore
Published on: 11 Nov 2026 11:06 AM IST
Nellore
X

Nellore: నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో ఇరిగేషన్ కాలువ పూడికతీత పనుల పరిశీలన!

Nellore: నెల్లూరు నగరంలోని 27వ డివిజన్ మాగుంట లేఅవుట్ రైల్వే ట్రాక్ రోడ్డులో ఉన్న ఇరిగేషన్ కాలువలో చేపట్టిన పూడికతీత పనులను 27వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్ల సూచనల మేరకు కాలువలో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు.

రాబోయే వర్షాకాలంలో వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా, కాలువలో నీరు నిలిచిపోయి స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

పూడికతీత పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేసి డివిజన్ ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore