Nellore: నెల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన!

Nellore: నెల్లూరులో డీసీసీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.

A Praveen, Nellore
Published on: 30 Sept 2026 5:48 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన!

Nellore: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు కాపాడటంతో పాటు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore