Ramapuram: రామాపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల!

Ramapuram: ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఎస్పీతో కలిసి పరిశీలించారు.

Pranathi Sri
Published on: 27 Sept 2026 7:26 PM IST
Ramapuram
X

Ramapuram: రామాపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల!

Ramapuram: ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, జేసీ మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ హిమాన్షు శుక్ల రామాపురంలో ఏఎస్‌ఎల్ నిర్వహించి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

హెలిప్యాడ్ నుంచి ప్రారంభమైన ఏఎస్‌ఎల్ కాన్వాయ్ కాకొల్లవారిపల్లె, ప్రజా వేదికతో పాటు ముఖ్యమంత్రి పర్యటించే పలు ప్రాంతాలను సందర్శించి తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో విధులు నిర్వహించే అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రోటోకాల్‌కు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పర్యటన విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు పావని, ఎలేష, జడ్పీ సీఈఓ వసుమతి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖల ఇంజనీర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Pranathi Sri

Pranathi Sri