Chillakur: తమ్మినపట్నం కోదండరామ స్వామి ఆలయంలో వరుణ యాగం

Chillakur: చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వరుణ యాగం, సహస్ర గట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 5:56 PM IST
Chillakur
X

Chillakur: తమ్మినపట్నం కోదండరామ స్వామి ఆలయంలో వరుణ యాగం

చిల్లకూరు: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలోని శ్రీ కోదండరామ స్వామివారి దేవస్థానంలో వరుణయాగం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్ వెల్లడించారు.

చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామంలోని శ్రీ కోదండ రామ స్వామి దేవస్థానంలో సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ మరియు కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు పంటలు బాగా పండించుకుని, కరువు కాటకాలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం,1008 కలిశాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, సహస్ర గట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోట సతీష్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తమ్మినపట్నంలోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంలో వరుణ యాగం నిర్వహించడం జరిగిందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండి రైతులు ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ పూజా కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి గిరి కృష్ణ , పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్