Kaligiri: కలిగిరి వద్ద కారు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు!

Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం దంటుపాలెం సమీపంలో కారు టైరు పగిలి చెట్టును ఢీకొన్న ప్రమాదం. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలింపు.

V. Kamaiah, Vinjamuru
Published on: 1 Nov 2026 8:37 AM IST
Kaligiri
X

Kaligiri: కలిగిరి వద్ద కారు ప్రమాదం నలుగురికి తీవ్ర గాయాలు!

Kaligiri: కలిగిరి మండలం దంటుపాలెం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి కొండాపురం వెళ్తున్న కారు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా,వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.వీరంతా టవర్ పనుల నిమిత్తం చెన్నై నుంచి కొండాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru