Nellore: కలువాయి వెంకటరెడ్డి పల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి వెంకటరెడ్డి పల్లి కూడలి వద్ద NH 565 పై రెండు కార్లు ఢీకొన్నాయి. కారు నెమ్మదిగా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిన వివరాలు ఇక్కడ చదవండి.
Nellore: కలువాయి వెంకటరెడ్డి పల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం!
Nellore: నెల్లూరు కలువాయి మండలం వెంకటరెడ్డి పల్లి కూడలి వద్ద జాతీయ రహదారి 565 పై ప్రమాదం చోటు చేసుకుంది,కడప జిల్లా బద్వేల్ నుండి తిరుపతి కి వెళ్తున్న కారును అనంతసాగరం మండలం సంజీవనగరం నుండి కలువాయి వెళ్తున్న కారు డీ కొట్టడంతో డివైదర్ పైకి ఎక్కి ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది,బద్వేల్ నుండి వెళ్తున్న కారు లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు , కారు నెమ్మదిగా వెళ్తుండటంతో పెను ప్రమాదం తప్పింది, ఈ కూడలిలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికులు అరచేతిలో పెట్టుకొని ప్రయానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.




